For All Hair Lovers

Monday 9 July 2018

వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ - Telugu Headshave Story by Raja Rao

"హే.. డేబనీర్ జర్నల్ లో ఈ ఆర్టికల్ చూసారా?" ఎగ్జైటింగ్ గా అడిగింది శిల్ప...

దీప, స్వప్న, స్మిత, లీల చూడలేదన్నట్టు తల అడ్డంగా ఊపారు...వాళ్ళు ఐదుగురూ ఓ వర్కింగ్ వుమెన్స్ హాస్టల్ లో రూమ్ మేట్స్..అందరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే...బాగా ధనిక కుటుంబాల నించి వచ్చిన వాళ్ళు...చాలా ఫాస్ట్ గా వుంటారు...
శిల్ప పుస్తకం తీసుకుని వాళ్ళ మధ్యకి వచ్చింది..అందరూ ఆసక్తిగా ఆ పుస్తకం వంక చూసారు...శిల్ప ఒక ఆర్టికల్ ని చూపించింది.
అది..."BALD IS BEAUTIFUL " అనే ఆర్టికల్...ఈ కాలం యువత ఎక్కువగా ఇష్టపడుతున్న హెయిర్ స్టైల్ అని ఒక పెద్ద ఆర్టికల్ రాసారు.....

పెద్ద నగరాలలో అబ్బాయిలే కాకుండా ఈ మధ్య అమ్మాయిలు కూడా నున్నటి గుండుతో కనిపించడానికి ఇష్టపడుతున్నారని ఫోటోలతో సహా వివరించారు అందులో..పాప్ స్టార్ కాసీ గుండుతో కనిపించినప్పటి నుంచి ఈ ట్రెండ్ బాగా పెరిగిందని వివరించారు...ఆ రూమ్ లో ఉన్న అమ్మయిలు ఐదుగురూ చాలా ఆసక్తిగా ఆ ఆర్టికల్ ని పూర్తిగా చదివారు...తరువాత దాని గురించి చాలా సేపు చర్చించుకున్నారు...పడుకునే ముందు కూడా నున్నటి గుండులో ఉన్న అమ్మాయిల ఫోటోల గురించే మాట్లాడుకున్నారు..

మరునాడు ఆదివారం..అందరికి సెలవు...ప్రతి ఆదివారం వాళ్ళు ఒకళ్ళ జుట్టుకి ఇంకొకరు ఆలివ్ నూనె తో మర్దన చేసుకుంటారు..ఆ రోజు కూడా ఐదుగురూ ఆలివ్ ఆయిల్ మస్సాజ్ చేసుకుని షాంపూ చేసుకున్నారు...లంచ్ చేసి వచ్చినాక వాళ్ళ మాటలు హెయిర్ స్టైల్స్ మీదకి మల్లినాయి...మళ్ళీ అందరూ గుండు గురించి మాట్లాడు కున్నారు....

"నాకు మాత్రం...గుండు చాలా బాగా నచ్చింది...నేను ఈ సాయంకాలమే సెలూన్ కి వెళ్లి నున్నగా గుండు గీయిన్చుకుంటాను " చెప్పింది శిల్ప...

"హే ...ఆర్ యు జోకింగ్ ?" లీల అడిగింది..

"నో డియర్..ఐ యాం వెరీ సీరియస్..నాకు ఆ స్టైల్ చాలా బాగుంటుంది.."స్థిరంగా చెప్పింది శిల్ప..

సాయంకాలం అయ్యింది..."నాతో ఎవరైనా సేలూన్ కి వస్తారా గుండు గీయించుకోవడానికి?"...జుట్టుని దువ్వుకుంటూ అంది శిల్ప..ఎవరూ మాట్లాడ లేదు...కానీ అందరికీ గుండు బాగా నచ్చింది..కానీ ఎలా వుంటుందో అని హేజిటేట్ చేస్తున్నారు...చివరికి లీల చెప్పింది..''నేను నీతో వస్తాను...కానీ గుండు కోసం కాదు జస్ట్ నీకు కంపెనీ గా "..శిల్ప , లీల కలిసి స్కూటి మీద "Hair Magic " అనే సేలూని కి బయలుదేరారు...అది ఆ సీటీ లో చాలా పాపులర్ సెలూన్...

రిసెప్షన్ దగ్గర చెప్పింది శిల్ప.."క్లీన్ షేవ్"....రిసెప్షనిస్ట్ ఆమె దగ్గర డబ్బు తీసుకుని రిసీట్ ఇచ్చింది....

"ప్లీజ్ వెయిట్ ఫర్ టెన్ మినిట్స్" అని చెప్పింది ఆమె వాళ్ళతో...

ఇద్దరూ అక్కడున్న సోఫాలో కూచున్నారు...అద్దాల తలుపుల్లోనించి సెలూన్ లోపల కనిపిస్తోంది...వరసగా ఐదు కుర్చీలు వున్నాయి...అన్నిటి మీద కస్టమర్స్ కూచుని వున్నారు..రకరకాల హెయిర్ కటింగ్స్ చేస్తున్నారు వాళ్లకి...పది నిముషాల తరువాత శిల్ప కి పిలుపు వచ్చింది....

శిల్ప వెళ్లి బార్బర్ చైర్ మీద కూచుంది..

"యు వాంట్ క్లీన్ షేవ్?" ఆమె భుజాల మీదుగా కేప్ ని కవర్ చేస్తూ అడిగాడు హెయిర్ ద్రెసర్ ...శిల్ప తల ఊపింది....
"మీకు క్లిప్పర్ షేవ్ కావాలా, లేక స్ట్రైట్ రేజర్ షేవ్ కావాలా?" అన్నాడు అతను శిల్ప పెట్టుకున్న హెయిర్ బ్యాండ్ ని తీస్తూ.

"స్ట్రైట్ రేజర్ షేవ్"....వెంటనే చెప్పింది శిల్ప...తిరుపతికి వెళ్ళినప్పుడల్లా కల్యాణకట్ట లో చేసే గుండ్లను చూస్తుంది ఆమె...అలా గుండు గీయడం ఆమెకి బాగా నచ్చుతుంది..

బార్బర్ ఆమె వత్తైన జుట్టుని బాగా బ్రష్ చేసాడు...తరువాత స్ప్రేయర్ తో ఆమె జుట్టు మీద బాగా నీళ్ళు జల్లి...చేతులతో..బాగా తడిపాడు ....
రేజర్ తీసుకుని దాంట్లో బ్లేడ్ మార్చాడు...శిల్ప తలని కుర్చీకి ఆనేలా వెనక్కి పట్టుకుని నుదుటి పైన షేవ్ మొదలు పెట్టాడు...శిల్ప కళ్ళార్పకుండా అద్దంలో చూస్తోంది...కొంచెం కొంచెం గ ఆమె జుట్టు తెగి ఆమె ఒల్లో పడుతోంది...లీల కూడా సిల్పకి చేస్తున్న షేవ్ ని ఆసక్తి గా చూస్తోంది...పది నిముషాల్లో శిల్ప నున్నటి గుండు తో మిగిలింది...బార్బర్ ఆమె గుండు మీద షేవింగ్ క్రీం రాసి మళ్ళీ షేవ్ చేసాడు..
"సూపర్ గా వున్నావు శిల్ప!!" అంటూ లీల శిల్ప బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది...

శిల్ప , లీల సెలూన్ బయటికి వచ్చి హాస్టల్ కి బయలుదేరారు...

"వావ్...వాట్ ఎ బ్యూటి!!" శిల్ప ని చూడ గానే ఆమె రూమ్ మేట్స్ పెద్దగా అరిచారు....ట్యూబ్ లైట్ వెలుగులో శిల్ప గుండు నిగ నిగమెరుస్తోంది..దీప వచ్చి శిల్ప గుండు మీద ముద్దుపెట్టుకుంది..మిగిలిన ముగ్గురు కూడా అదే పని చేసారు...
తరువాతి ఆదివారం రోజు లీల చెప్పింది.."నాకు కూడా శిల్ప లాగ గుండు చేయించుకుందామని వుంది..."

వెంటనే శిల్ప అంది..."నీకు కావాలంటే చెప్పు ఇప్పుడే నీకు గుండు చేస్తాను"...

"నువ్వా..ఇక్కడా!!"ఆశ్చర్యంగా అంది లీల ...

"ఔను ....ఇప్పుడే..ఇక్కడే నీకు నున్నటి గుండు చేస్తాను"...కాన్ఫిడెంట్ గా చెప్పింది శిల్ప

"నీకు గుండు చేయడం వచ్చా?" స్మిత అడిగింది

"అదేమన్న ఆటం బాంబ్ తయరుచేయడమా రాకపోవడానికి.." అంది శిల్ప ....నిజానికి శిల్ప హెయిర్ ఫెటిష్ ...
"మరి మన దగ్గర రేజర్ లేదు గా" అంది స్వప్న...

'ఎంత సేపు...పది నిముషాల్లో తెస్తాను లీల ఒప్పుకుంటే.."అంది శిల్ప...లీల కొంచెం సేపు ఆలోచించి...."సరే..తీసుకురా..నీ దగ్గరే గుండు చేయిన్చుకొంటాను " అంది...

శిల్ప వెంటనే వెళ్లి ఒక స్ట్రైట్ రేజర్ కొని తెచ్చింది.....

లీల జుట్టు ఆమె నడుము దాకా వుంటుంది..బాగా వత్తు...శిల్ప బాల్కని లో స్టూల్ వేసి లీలని అక్కడ కూచోమంది...లీల వచ్చి అక్కడ కూచుంది...మిగిలన ముగ్గురూ నిలబడి చూస్తున్నారు...శిల్ప మగ్ తో నీళ్ళు తెచ్చి లీల జుట్టుని బాగా తడిపింది....తరువాత లీల నడి నెత్తి మీద రేజర్ ని పెట్టి గీకడం మొదలు పెట్టింది....

లీల జుట్టు పాయలు పాయలు గా తెగి కింద పడుతోంది....అది చూస్తున్న స్మిత కి ఒళ్లంతా ఏదోలా వుంది....

శిల్ప ముందు లీల ఎడమవైపు పూర్తిగా గీకేసింది..ఇప్పుడు లీల ఎడమవైపు నున్నగా, కుడివైపు వతైన జుట్టు వున్నాయి...దీప లీల దగ్గరికి వచ్చి గుండు ఐన వైపు చేత్తో తడిమింది...శిల్ప లీలకి కుడి వైపు మొదలు పెట్టింది.....ఐదు నిముషాల్లో లీల పూర్తి గా బోడి గుండు ఐపోయింది...

లీల లేచి లేవగానే దీప వచ్చి స్టూల్ మీద కూచుని "శిల్ప ప్లీజ్...నాకు కూడా గుండు చేయవా?"అంది....
దీప్తి భుజాల దాకా వుండే బాబ్...శిల్ప దీప జుట్టుని తడపకుండా గీకడం మొదలు పెట్టింది..అదొక అనుభవం....పొడి జుట్టు తెగి కింద పడుతోంది..

కాసేపటికి...శిల్ప, దీప, లీల బోడి గుండుని తడుముకుంటూ రూమ్ లోకి వెళ్లారు..

No comments:

Post a Comment